వరాలతెలుగు
తెలుగుకు
వెలుగులిస్తే
విరిలావికసిస్తా
తెలుగుకు
మెరుగులుదిద్దితే
మురిసిపోతా
తెలుగుకు
సొబగులద్దితే
సంబరపడతా
తెలుగుకు
తీపినిపూస్తే
తక్షణమాస్వాదిస్తా
తెలుగుకు
పట్టాభిషేకంచేస్తీ
పెద్దగాజైకొడతా
తెలుగును
తేటతెల్లంచేస్తే
తృప్తిపడతా
తెలుగుకు
పెద్దాసనంవేస్తే
పరవశిస్తా
తెలుగును
లెస్సంటే
మిడిసిపడతా
తెలుగును
తేనెయంటే
తన్మయపడుతా
తెలుగు
శ్రావ్యమంటే
సంకలెగరేస్తా
తెలుగుకు
జేజేలుకొడితే
కంఠంకలుపుతా
తెలుగును
తలకెత్తుకుంటే
తోడుగానిలుస్తా
తెలుగును
తళతళలాడిస్తే
తనివితీరాచూచితరిస్తా
తెలుగును
తల్లియంటే
తమ్ముడిగాతోడుంటా
తెలుగును
చిలికితే
వెన్ననుబయటకుతీస్తా
తెలుగును
పూయిస్తే
పరిమళాలుచల్లుతా
తెలుగును
పండిస్తే
ప్రజలకందిస్తా
తెలుగును
పారిస్తే
పొంగిపోతా
తెలుగు
తీరానికొస్తే
ఆధిత్యమిస్తా
తెలుగున
అక్షరాలల్లితే
పుటలకెక్కిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment