గుణపాఠాలు
అనుభవం
నేర్పుతుంది పాఠం
అవకాశం
ఉపయోగించుకుంటే అదృష్టం
అందం
ఎక్కిస్తుంది అందలం
ఆనందం
శరీరానికిస్తుంది సగంబలం
ఆరాటం
చేయిస్తుంది పోరాటం
అవమానం
కోరుకుంటుంది ప్రతీకారం
అనుమానం
అవుతుంది పెనుభూతం
అభిమానం
ప్రేమకు మూలకారణం
అనురాగం
పంచుతుంది మమకారం
అహంకారం
కలిగిస్తుంది వినాశనం
అసహనం
అభివృద్ధికి ఆటంకం
ఆరోగ్యం
అందరికి మహాభాగ్యం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment