ఓరి తెలుగోడా!
(గేయము)
చెయ్యెత్తి గళమెత్తి
జైకొట్టు తెలుగోడా
చరిత్ర పుటలందు
బహుఖ్యాతి కలవాడా
తెలుగుగేయము
పాడరా
తియ్యదనము
పంచరా
తెలుగుకవిత్వము
వ్రాయరా
తన్మయత్వము
కలిగించరా
తెలుగుదనము
చూపరా
తెల్లవారువెలుగు
తలపించరా
తెలుగుపతాకము
ఎత్తరా
తెలుగుగొప్పదనము
చాటరా
తెలుగుపొలాలు సారవంతమైనవని
చెప్పరా
తెలుగుపంటలు కడునాణ్యమైనవని
తెలపరా
తెలుగుతోటను
పెంచరా
తెలుగుపూలను
పూయించరా
తెలుగుసొగసులు
చూపించరా
తెలుగు పరిమళాలు
వెదజల్లరా
తెలుగోళ్ళవెన్ను
తట్టరా
తోటివాళ్ళతృష్ణను
తీర్చరా
తెలుగుబాషను
తలకెత్తుకోరా
తెలుగుతలమానికమని
తెలుపరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment