కవిత్వం
కవిత్వం
కటికచీకటిలోనూ
వెలుగులు చిమ్మాలి
దారిని చూపాలి
ముందుకు నడపాలి
కవిత్వం
అఙ్ఞానులసహితమూ
చదివించాలి
సంతసపరచాలి
స్పందింపజేయాలి
కవిత్వం
అంధులకుకూడా
అందం చూపాలి
ఆనందం కలిగించాలి
సందేశం ఇవ్వాలి
కవిత్వం
చెవిటివారికీ
శ్రావ్యంగా వినిపించాలి
మనసుల మురిపించాలి
భాషాభిమానం కలిగించాలి
కవిత్వం
నిత్యమూ
సూర్యునిలా వెలుగుతుండాలి
జాబిలిలా వెన్నెలవెదజల్లుతుండాలి
భూమిలా భ్రమణంకొనసాగిస్తుండాలి
కవిత్వం
మనసులనుమీటి
ఆలోచనలను పారించాలి
అంతరంగాన్ని మదించాలి
ఆశయాలను రేకెత్తించాలి
కవిత్వం
అందరినీ
ఆడించాలి
పాడించాలి
ఓలలాడించాలి
కవిత్వం
పాఠకుల
కళ్ళను తెరిపించాలి
నిజాలను చూపించాలి
నీతిమార్గాన నడిపించాలి
కవిత్వం
శాశ్వతమై
మనుగడ కొనసాగించాలి
మననం చేయించాలి
కవులను తలపించాలి
కవిత్వం
అద్బుతం
అమరం
అనంతం
అపరూపం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment