కొంటెచూపుల కోమలి
గాజులు
గలగలా
మ్రోగిస్తూ
చూపును ఆకర్షించె చిన్నది
నవ్వులు
కిలకిలా
కురిపిస్తూ
చూపును ఆకట్టుకొనె సుందరి
కన్నులు
మిళమిళా
మెరిసిపిస్తూ
చూపును పట్టేసె చెలి
మోమును
కళకళా
వెలిగిస్తూ
చూపును కట్టేసె సుందరాంగి
పలుకులు
బిరబిరా
సంధిస్తూ
చూపును స్తంభించె సుమబాల
చేతులు
చకచకా
ఊపుతూ
చూపును నిలిపేసె సౌందర్య
దుస్తులు
తళతళలాడిస్తూ
కాంతులు వెదజల్లుతూ
చూపులను బంధించె చక్కనిచుక్క
నగలు
ధగధగమని
ప్రకాశింపజేస్తూ
చూపును తిప్పుకొనె చెలియ
ముంగురులు
రెపరెపలాడుచుండగా
ముచ్చటపరుస్తూ
చూపును లంకించుకొనె సఖియా
పూలు
ఘుమఘుమలాడుచుండగా
కొప్పునతురుముకొని
చూపును చిక్కించుకొనె సింగారి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment