చేసినకర్మము చెడనిపదార్థము


నెత్తీనోరూ

మొత్తుకున్నా

నాటకాలు

ఆడొద్దని


కాళ్ళూవ్రేళ్ళూ

పట్టుకున్నా

కష్టాలపాలు

చేయొద్దని


గడ్డంచేతులు

పట్టుకొనిచెప్పా

గడ్డుపరిస్థితులు

తెచ్చుకోవద్దని


ప్రేమగా

చెప్పా

పలువచేష్టలు

మానుకోమని


పదేపదే

బ్రతిమాడా

చెడ్డదారిన

నడవొద్దని


సూక్తులు

చెప్పా

మంచిగా

మెలగమని


శంఖమూది

అరిచా

తలకు

ఎక్కించుకోలా


పాటపాడి

వినిపించా

ఆలకించలా

అర్ధంచేసుకోలా


కవితకూర్చి

పఠించా

మనసుపెట్టి

వినలా


పరమాత్మ

చూస్తున్నాడని

ఘోరాలను

చెయ్యొద్దనిచెప్పా


అయినా లాభము

కనపడలా

మార్పులు

చేసుకోలా


పెడచెవిని

పెట్టా

పాపాలకు

ఒడిగట్టా


రోగాలు

తెచ్చుకొనే

కష్టాల

పాలయ్యే


కుటుంబం

చితికిపోయే

గౌరవం

అడుగంటా


చివరకు చిన్నవయసునే దేహం

విడిచిపెట్టా

కర్మఫలం

అనుభవించా


చేసిన కర్మము

చెడని పదార్థము

చేరునుకర్తను తక్షణము

చూపునువేళన ఫలితము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog