నువ్వు ఎవరంటే ఏమనిచెప్పను?


నువ్వు

ఎవరంటే

ఏమనిచెప్పను?


నువ్వు

పువ్వులలో

తావివి


నువ్వు 

నవ్వులలో

వెలుగువి


నువ్వు

కళ్ళల్లో

కాంతివి


నువ్వు

నోటిలో

నాలుకవి


నువ్వు

రుచులలో

తీపివి


నువ్వు

రూపములో

మోహినివి


నువ్వు

పలుకులలో

మాధుర్యానివి


నువ్వు

చూపులలో

చక్కదనానివి


నువ్వు

ప్రకృతిలో

అందానివి


నువ్వు 

మదిలో

ఆనందానివి


నువ్వు

పగలులో

కిరణానివి


నువ్వు

చీకటిలో

వెన్నెలవి


నువ్వు

దేహంలో

ప్రాణానివి


నువ్వు

జీవితంలో

గమ్యానివి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog