అబ్బాయి ప్రసన్నవదన్


ఆదివారమునాడు అబ్బాయిపుట్టాడు

అమ్మా అమ్మా అని అప్పుడే అరిచాడు


సోమవారమునాడు స్కూలుకూవెళ్ళాడు

సరస్వతీమాతను చక్కగాప్రార్ధించాడు


మంగళవారమునాడు మాటలూనేర్చాడు

ముద్దుగాపలికాడు ముచ్చటాపరిచాడు


బుధవారమునాదు బుద్ధిగాచదివాడు

బుజ్జిపిల్లలతోడ భళేభళే అడాడుపాడాడు


గురువారమునాడు గటగటాపాఠాలువల్లెవేశాదు

గురువులమెప్పును ఘనముగాపొందాడు


శుక్రవారమునాడు సుద్దులుచదివాడు

శ్రీలక్ష్మిదేవిశ్లోకాన్ని కంఠస్థముచేశాడు


శనివారమునాడు శ్రద్ధగావిన్నాడు

శ్రీవెంకటేశ్వరుని సుప్రభాతమువినిపించాడు


అబ్బాయిని అందంగా తయారుచేద్దాం

పెద్దపెద్ద చదువులకు పరదేశాలుపంపుదాం


ఉన్నతమైన ఉద్యోగాలు చేయిద్దాం

మనతెలుగుతల్లికి ముద్దుబిడ్డనుచేద్దాం


బాలల్లారా మీరూ చక్కగా చదవండి

బాలికల్లారా మీరూ మంచిగా మెలగండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog