కవిగారి కవితలు


లేత కొబ్బరిపలుకులు

తీపి పంచదారచిలుకలు

కమ్మని కాకినాడకాజాలు

ఆత్రేయపురం పూతరేకులు కవిగారి కవితలు


ప్రకృతి సహజసొగసులు

పచ్చని కొండాకోనలు

ప్రవహించే సెలయేర్లు

నర్తించే నెమలులు కవిగారి కవితలు


వికసించిన విరులు

పరిమళించిన పూలు

అలరిస్తున్న అలరులు

ప్రకాశిస్తున్న పుష్పాలు కవిగారి కవితలు


అక్షరాల అల్లికలు

పదాల పొందికలు

భావాల బహిర్గతాలు

ప్రాసల ప్రయోగాలు కవిగారి కవితలు


కొప్పులో పువ్వులు

మోముపై నవ్వులు

కాటుక కన్నులు

నుదిటిపై బొట్టులు కవిగారి కవితలు


చేతికిచ్చిన అరటికాయలు

చెట్టునపండిన దోరజామపండ్లు

పళ్ళెంలోవడ్డించిన పంచభక్ష్యాలు

జుర్రుకోమంటున్న పాలతాలికలు కవిగారి కవితలు


అక్షర కుసుమాలు

అక్షర సౌరభాలు

అక్షర ముత్యాలు

అక్షర సత్యాలు కవిగారి కవితలు


తినండి తృప్తిపడండి

జుర్రుకోండి చప్పరించండి

చూడండి చదవండి

ఆలోచించండి మదిలోదాచుకోండి కవిగారి కవితలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog