తెలుగుబిడ్డ లేవరా!


తెలుగుబిడ్డ

లేవరా

తాజాపరిస్థితి

చూడరా


తెలుగువెలుగులు

చిమ్మరా

ప్రతిభాపాఠవాలు

చాటరా


తెలుగోళ్ళకు ఘనత

తేరగా రాదురా

తొలిగ తెలుసుకొనరా

తర్వాత తెలియచెప్పరా


తెలుగుభాష

తియ్యదనాన్ని

తేటతెల్లము

చేయరా


తెలుగువారి

వీరత్వాన్ని

నాలుగుదిక్కుల

వ్యాపించరా


తెలుగోళ్ళ

ప్రఖ్యాతిని

జగమంతా

తెలుపరా


తెలుగువారి

పాతచరిత్రను

ప్రజలకెల్లా

గుర్తుచెయ్యరా


తెలుగుకవుల

కావ్యఖండాలను

వెలికితీయరా

వ్యాప్తిజేయరా


తెలుగుపౌరుషాలను

మనయువకులకెల్లా

ఎరిగించరా

వారసత్వం నిలుపమనరా


తెలుగోళ్ళకు మర్యాద

ఊరకనేరాదురా

విజయాలుపొందరా

విశ్వఖ్యాతిపొందురా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog