ఓ భవాని!
వద్దొద్దు నాకొద్దు
పంచభక్ష్యాలొద్దు
బ్రతకతిండిచాలు
ఓ అన్నపూర్ణా
వలదొలదు నాకొలదు
ఆస్తిపాస్తులువలదు
ఉండపూరిల్లుచాలు
ఓ భవానిమాతా
పనిలేదు పనిలేదు
అప్సరసలాంంటి సతితోపనిలేదు
మంచి మనసున్నభార్యచాలు
ఓ విశాలాక్షీ
అడుగను అడగను
అందచందాలడగను
ఆరోగ్యమిచ్చినచాలు
ఓ రాజరాజేశ్వరీ
కోరను కోరను
తమ ప్రత్యక్షదర్శనమునుకోరను
కటాక్షించినచాలు
ఓ సింహవాహినీ
ఇవ్వొద్దు ఇవ్వొద్దు
భోగభాగ్యాలివ్వొద్దు
సర్వులను సుఖపరిచినచాలు
ఓ శాంభవిదేవీ
పనిలేదు పనిలేదు
శక్తియుక్తులతోపనిలేదు
తమనుపూజించ భక్తినిచ్చినచాలు
ఓ పార్వతిదేవీ
వేడుకోను వేడుకోను
తెలివితేటలు వేడుకోను
తమను మరవకుండచేసినచాలు
ఓ మహేశ్వరిదేవీ
అక్కర్లేదు అక్కర్లేదు
పనిపాటలక్కర్లేదు
తమను కొలవనిచ్చినచాలు
ఓ కాత్యాయణిదేవీ
ఆశించ నాశించ
స్వర్గసుఖాలనాశించ
తమనుపూజించ భాగ్యమిచ్చినచాలు
ఓ దాక్షాయణిదేవీ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
💐🌷🌷🌷💐💐💐💐అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Comments
Post a Comment