కవినేల ప్రకృతి కవ్వించు
పువ్వులేల
పరిమళాలు
ప్రసరించు
జాబిలేల
వెన్నెలను
వెదజల్లు
ఆకాశమేల
నీలిరంగద్దుకొను
నయనానందమునిచ్చు
తారకలేల
తళతళలాడు
తన్మయత్వపరచు
మేఘాలేల
చినుకులు
చిందించు
సూర్యుడేల
జగాన్నివెలిగించు
జనులమేలుకొలుపు
నీరేల
పారునదులందు
పయోధిచేరుటకు
కోకిలలేల
కుహుకుహుమనికూయు
కమ్మగావినిపించు
నెమలులేల
పురులిప్పు
నాట్యమాడు
పచ్చదనమేల
పుడమినికప్పు
పరికించువారినిపులకించు
అలలేల
ఆర్ణవతీరమందు
అలరించునెగిసిపడుచు
అందమేల
ఆకట్టుకొను
అలరించు
ఆనందమేల
మోములకెక్కు
మనసులమురిపించు
కవినేల
ప్రకృతి
కవ్వించివ్రాయించు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment