రంగులలోకం


రంగులలోకం

రమ్మంటుంది

ఆనందం

ఆస్వాదించమంటుంది


పుడమినికప్పు

పచ్చదనం

కనులకిచ్చు

కమ్మదనం


నయనానందకరం

నీలిగగనం

అంతరిక్షం

అతికమనీయం


పున్నమిరోజు

తెల్లనెలవెలుగు

చల్లదనమిచ్చు

సంతసమునిచ్చు


చిలుకముక్కు

ఎర్రగానుండు

చూడచూడమనసును

దోచుకొనుచుండు


నీటిచుక్కలురాల్చు

నల్లనిమబ్బులు

కర్షకులకిచ్చును

ఆనందపరవశమును


బంతులుచామంతులు

పసుపురంగునందు

ప్రకాశించుచుండు

ముచ్చటగొలుపుచుండు


పూలరాణిరోజాపూవు

గులాబిరంగు

గుండెల్లోగుచ్చుకొను

గుబళించు


రమణులకొప్పులందు

రకరకాలరంగులపూలు

ముసిముసిలాడు

ముచ్చటపరచు


భామలుబాసిల్లు

బంగారువర్ణమునందు

భ్రమలుకలిపించు

భార్యనుచేసుకొనమనుచుండు


విభిన్నమైన సీతాకోకచిలుకలు

విచిత్రమైన రంగులనుదాల్చు

వివిధపూలపై వ్రాలుచుండు

పరికించువారిని పులకించుచుండు


బతుకమ్మ

రంగులపూలపండుగ

హోళీ

రంగులుచల్లుకునేపండుగ


అమిత సౌందర్యాన్నిస్తాయ్యి

ఆడవారికి రంగువస్త్రాలు

రంజింప జేస్తాయి

రంగులేసిన బొమ్మలు


రంగుపడుతుందని

సందేహించకండి

రంగులలోకాన్ని

స్వాగతించండి


రంగుదృశ్యాలను

చూడండి

రంగులనడుమునందు

విహరించండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog