కవనప్రవాహం
(కవిగారికలం)
కలం పరుగెత్తిందంటే
అక్షరాలు అల్లుకున్నట్లే
కలం సాగిందంటే
పదంపదం పొసిగినట్లే
కలం ఉప్పొంగిందంటే
మనసులు తడిసినట్లే
కలం కదిలిందంటే
జలం ప్రవిహించనట్లే
కలం కూర్చిందంటే
గళం ఎత్తుకోవాల్సిందే
కలం కురిసిందంటే
ఏరు ముందుకుసాగవల్సిందే
కలం గీసిందంటే
కాగితాలు వెలిగిపోవల్సిందే
కలం మండిందంటే
శౌర్యం పొంగిపొర్లాల్సిందే
కలం సరసాలాడిందంటే
ప్రణయం పుట్టాల్సిందే
కలం పదునెక్కిందంటే
మనసుకు పనిపెట్టాల్సిందే
కలం కన్నీరుకార్చితే
దుఃఖంలో మునిగిపోవాల్సిందే
కలం రక్తంచిందిస్తే
దేహం ఉడికిపోవల్సిందే
కలం ఉసిగొల్పిందంటే
రంగంలోకి దిగాల్సిందే
కలం ప్రభోధిస్తే
జనం ఆచరించాల్సిందే
కలం రక్తిగట్టిస్తే
పఠనం పదేపదేచేయాల్సిందే
కలం అందాలుచూపిందంటే
ఆనందం కలగాల్సిందే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment