రమణీమణుల రంగరంగవైభవములు
కళారంగమందు
విదుషీమణులు
విభిన్నపాత్రలందు
వెలిగిపోతున్నారు
ఆటలరంగమందు
క్రీడాకారిణులు
కడునైపుణ్యాన్నిచూపుతున్నారు
ఖండాంతరఖ్యాతినితెస్తున్నారు
వైఙ్ఞానికరంగమందు
శాస్త్రకారిణులు
చెలరేగిపోతున్నారు
సుసంపన్నంచేస్తున్నారు
కంప్యూటరురంగమందు
రమణీమణులు
రాటుతేలుతున్నారు
రాణిస్తున్నారు
విద్యారంగమందు
విరిబోడులు
వికసిస్తున్నారు
విశ్వకీర్తినిపొందుతున్నారు
సేవారంగమందు
స్త్రీరత్నములు
శోభిల్లుతున్నారు
సుస్థిరపడుతున్నారు
ఆరోగ్యరంగమందు
వైద్యురాళ్ళు
వ్రేళ్ళూనుకుంటున్నారు
విశ్రుతసేవలందిస్తున్నారు
ఆర్ధికరంగమందు
ఆడువారు
అలరారుతున్నారు
అభివృద్ధిచెందుతున్నారు
కవనరంగమందు
కవియిత్రులు
కలాలనుఝళిపిస్తున్నారు
కవితలనుకూర్చేస్తున్నారు
అన్నిరంగాలందు
అతివలు
ఆధిపత్యం చెలాయిస్తున్నారు
అర్ధభాగాన్ని నిలుపుకుంటున్నారు
స్త్రీలశక్తి అపారము
స్త్రీలరక్తి అనునిత్యము
స్త్రీలయుక్తి అమోఘము
స్త్రీలభక్తి అచంచలము
అమ్మలకు వందనాలు
అర్ధాంగులకు ధన్యవాదాలు
కోడల్లకు శుభాశిస్సులు
కూతుర్లకు శుభదీవెనలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment