బాలలదినోత్సవము
చాచానెహ్రు పుట్టినరోజు
చిన్నారులకు అంకితము
ప్రతినవంబరునెల పద్నాలుగు
భావీపౌరుల దినోత్సవము
పాపాయిల ప్రాముఖ్యము
తెలపటమే ఉత్సవలక్ష్యము
పిల్లలకు సక్రమమార్గదర్శనమే
బాలలదినోత్సవ ధ్యేయము
పిల్లల పాలబుగ్గలు
పోలును లేతగులాబీమొగ్గలు
శిశువుల ముద్దుమాటలు
చల్లును తేనెలజల్లులు
పసివాళ్ళ నవ్వులు
ప్రసరించును వెన్నెలకాంతులు
బాలల చదువులు
తెచ్చిపెట్టును ఉన్నతోద్యోగాలు
చాచాను తలచుకుందాం
బెలూనులు ఎగరేపిద్దాం
ఆటలను ఆడిద్దాం
పండుగను జరుపుకుందాం
పిల్లలకు బహుమతులిద్దాం
మిఠాయీలు పంచేద్దాం
చిన్నారులపట్ల ప్రజలకు
అవగాహన కలిపిద్దాం
యావత్తుదేశాన్ని ఒకగృహంగా
భావించమందాం
పిల్లలే దేశభవనానికి
పిల్లర్లనిచెబుదాం
అందంగా నిర్మించటంలో
అందరంసాయపడదాం
ఆనందంగా భవిష్యత్తులో
బ్రతకటంనేర్పుదాం
సమానత్వాన్ని
పాటించమందాం
సోదరభావంతో
మెలగమందాం
కులమతాలను
నిర్మూలించమందాం
నవసమాజనిర్మాణానికి
పాటుపడమందాం
బాలల్లారా బాలికల్లారా
భావీభారత పౌరుల్లారా
భారతదేశం మీదిరా
భవిష్యత్తు మీదిరా
భారతమాతకు
జైజైలు కొట్టండిరా
తెలుగుతల్లికి
వందనాలు చెప్పండిరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment