సమానత్వమేది?
మానవులంతా
ఒకటే
హక్కులందరికీ
సమానమే
సమానత్వాన్ని వ్యతిరేకిస్తే
సంఘర్షణకు దిగుతా
విచక్షణ చూపితే
విరుచుకపడతా ఎదురుతిరుగుతా
ఎల్లవేళలా నవ్వుచుండేవారు
కొందరు
ఎప్పుడూ ఏడుస్తుండేవారు
కొందరు
డబ్బుదాచుకునేవారు
కొందరు
ధనములేకర్ధించేవారు
కొందరు
భవంతులలో నివసించేవారు
కొందరు
చెట్లక్రిందరోడ్లమీద ఉండేవారు
కొందరు
భోగభాగ్యాలలో తేలేవారు
కొందరు
పేదరికంలో మగ్గేవారు
కొందరు
కార్లలోవిమానాలలో తిరిగేవారు
కొందరు
నడకపైసైకిళ్ళపై వెళ్ళేవారు
కొందరు
ఒడలొంచి పనిజేసేవారు
కొందరు
బట్టలునలగకుండ పెత్తనంజేసేవారు
కొందరు
కాలుమీదకాలేసుకొని కూర్చొనేవారు
కొందరు
తీరికలేకుండా శ్రమించేవారు
కొందరు
కోరినవన్ని తినేవారు
కొందరు
తినటానికిలేక పస్తులుండేవారు
కొందరు
సుఖాలు అనుభవించేవారు
కొందరు
కష్టాలు పడేవారు
కొందరు
హాయిగా నిద్రపోయేవారు
కొందరు
నిదురపట్టక మేలుకొనియుండేవారు
కొందరు
బానిసలుగా బ్రతికేవారు
కొందరు
పెత్తనము చలాయించేవారు
కొందరు
మగవాడినని మీసంమెలవేస్తే
బుద్ధిచెబుతా
అబలని వెర్రివేషాలేస్తే
తిరగబడతా
కడుపు
తరిగిపోతుంది
మనసు
మండిపోతుంది
కోపము
కట్టలుతెంచుకుంటుంది
సమాజాన్ని
సంస్కరించాలనిపిస్తుంది
ఎవరు
దీనికి కారకులు?
ఎవరు
ఇందుకు బాధ్యులు?
కనబడితే
కాలరుపట్టుకుంటా
దొరికితే
భరతంపడతా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
సమానత్వం
ఎక్కడ?
సమాజతత్వం
ఏమిటీ?
సూటిగా
అడుగుతున్నా
దీటుగా
స్పందించమంటున్నా
Comments
Post a Comment