కవితాజల్లులు కురిపిస్తా
కర్షకుల పనిపాటులకు
కార్మికుల వ్యయప్రయాసలకు
కార్యాలయసిబ్బంది శ్రమకు
కూలీల కాయకష్టాలకు
కరిగిపోతా
కదంత్రొక్కుతా
కడగండ్లు తీరుస్తా
కన్నీరు తుడిచేస్తా కవితాజల్లులు కురిపిస్తా
హలాలకు పొలాలకు
కలాలకు కార్యాలయాలకు
గొడ్డళ్ళకు రంపాలకు
గడ్డపారలకు కొడవళ్ళకు
సలాము చేస్తా
సరఫరా చేయిస్తా
నిత్యమూ తలచుతా
మనసారా పూజిస్తా కవితాజల్లులు కురిపిస్తా
కలాన్ని కత్తిలాఝళిపిస్తా
కాగితాలపై భావాలుకురిపిస్తా
నవ్యగీతికల నల్లేస్తా
రమ్యరీతిన వ్రాసేస్తా
శ్రావ్యంగ చెవులచేరుస్తా
జనులను చైతన్యపరుస్తా
నవసమాజనిర్మాణానికి పాటుబడతా
సమన్యాయమందరికి చేయిస్తా కవితాజల్లులు కురిపిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కనులతో కష్టాలకంటా
కలానికి పనిబెడతా
కవితలను పాఠకులకుచేరుస్తా
కదిలించి పరివర్తనతీసుకొస్తా కవితాజల్లులు కురిపిస్తా
బీదల బాగుపరచమంటా
భాగ్యాలు భాగించమంటా
భావాలు బయటపెడతా
భవ్యదివ్య భారతావనికిపాటుబడతా కవితాజల్లులు కురిపిస్తా
విరచించే కవితలకు
వినిపించే గీతాలకు
వర్ణించే దృశ్యాలకు
వివరించేవిధానాలకు వందనాలుచెబుతా కవితాజల్లులు కురిపిస్తా
Comments
Post a Comment