చిట్టిపాపలు
పిల్లలు ఇంటిలోనుండాలి
ఇల్లు కళకళలాడాలి
బాలలు నవ్వుతువుండాలి
మోములు వెలుగులుచిమ్మాలి
చిన్నారులు ఆటలాడాలి
ఆరోగ్యంతో బాగుండాలి
పసివారు చక్కగపాడాలి
పదిమందిని పరవశింపజేయాలి
బాలలు అందంగాయుండాలి
అందరిని ఆకట్టుకొనాలి
పాపాయిలు ముద్దుగాపలకాలి
మన్ననలను పొందుచుయుండాలి
బిడ్డలు అమ్మఒడిలోకూర్చుండాలి
అనందాలను ఇచ్చుచుండాలి
పసివాండ్రు నాన్నభుజాలపైకెక్కాలి
పరవశాలను పంచిపెట్టుచుండాలి
పసికూనలు చిట్టితమ్ముల నాడించాలి
అమ్మకు సాయము చేస్తుండాలి
చిట్టిపాపలు చెల్లెలనెత్తుకోవాలి
మాటలతోమురిపించి ఏడుపునాపించాలి
తాతకు ముద్దులనివ్వాలి
మిఠాయిలు కొనిపించుకోవాలి
నానమ్మతో కబుర్లుచెప్పాలి
చిల్లరడబ్బులు కొట్టెయ్యాలి
పాపలు చదువుతుండాలి
విద్యబుద్ధులు నేర్వాలి
పసిబాలలు చక్కగమెలగాలి
పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలి
చిన్నపిల్లలు శుచిగానుండాలి
నిత్యం స్నానాలుచెయ్యాలి
పసివాళ్ళు అల్లరిమానాలి
మంచిబుద్ధులు నేర్వాలి
చిట్టిపాపాయిలు వెలుగుదివ్వెలు
పసివారు లేతగులాబీమొగ్గలు
బుజ్జాయిలు బంగరుబొమ్మలు
బుడతలు కళ్ళకుకాంతులు
పిల్లలపలుకులు తేనెచుక్కలు
పాపాయిలనవ్వులు వెన్నెలవెలుగులు
పిల్లలు మెరుపులు ఉరుములు
పిల్లలు పిడుగులు నీలిమేఘాలు
అబ్బాయిలు అమ్మాయిలు
అభంశుభం తెలియనివాళ్ళు
అన్యాయాల నెరుగనివాళ్ళు
అమాయకులు నిరాడంబరులు
పిల్లలులేని ఇల్లు
వెన్నెలలేని రాత్రి
చిరునవ్వులులేని చిన్నారులు
పూలులేని చెట్లకొమ్మలు
పిల్లలను
ప్రేమించండి
బాలలను
బాగుపరచండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment