తెలుగు జిలుగులు
తెలుగునాట
తిరుగరా
తెలుగుతీపి
తెలుపరా
తెలుగు అక్షరాలు
వెలిగించరా
తెలుగు కాంతులు
విరజిమ్మరా
తెలుగుతమ్ముళ్ళను
కలవరా
తియ్యందనాలను
పంచరా
తెలుగుతోటలోన
విహరించరా
మల్లెలమత్తులోన
మురిసిపోరా
తెలుగుపలుకులు
వినిపించరా
తేనెచుక్కలు
చిందించరా
తెలుగు ఖ్యాతిని
చాటరా
తలను ఎత్తికొని
నడవరా
తెలుగువాడినని
గర్వించరా
తెలుగునందె
మాట్లాడరా
తెలుగుతల్లిని
పూజించరా
పూలదండను
మెడనవేయరా
తెలుగుపాటలు
పాడరా
తోటివారిని
కదిలించరా
తెలుగుబాట
పట్టరా
తెలుగునుడిని
తేటపరచరా
తెలుగుకోసం
శ్రమించరా
తెలుగుబాషను
శ్లాఘించరా
తెలుగువీరుల
స్మరించరా
తెలుగుదనమును
బ్రతికించరా
తెలుగువనమును
పెంచరా
తెలుగుసౌరభాల
వెదజల్లరా
తెలుగు సొగసులను
తిలకింపజేయరా
తెలుగుమదులను
తృప్తిపరచరా
తెలుగు తక్కువకాదని
చెప్పరా
తెలుగుపై మక్కువనెక్కువ
చేయరా
తెలుగోళ్ళు
ఆరంభశూరులు కాదనరా
తెలుగువారు
సాధకులని నిరూపించరా
తెలుగుకవితలను
వ్రాయరా
తెలుగుమదులను
దోచారా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment