పాపాయిల్లారా!
పకపకనవ్వుల పసిపాపల్లారా
పాలాబుగ్గల పాపాయిల్లారా
పిల్లలతోటి కలసిమెలసియుండండి
పీకలదాకా పూటుగాతినకండి
పుస్తకాలసంచి భుజానేసుకోండి
పూటపూట పాఠశాలకువెళ్ళండి
పెద్దలమాటలు పెడచెవిపెట్టకండి
పేచీలెవ్వరితో పెట్టుకోకండి
పైపైమెరుగులచూచి పొరబడకండి
పొరపాటుపనుల నెపుడూచేయకండి
పోకిరితనముపోరాటము మానండి
పౌరుషాలుపెంకితనాలు వదలండి
పంతాలకు పట్టింపులకుపోకండి
పట్టువిడుపుల పాటించటమెరగండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment