డాక్టర్ల దారుణాలు


చికిత్సాకేంద్రాలు

విరివిగా వెలుస్తున్నాయి

మనుషులప్రాణాలకు

వెలలు కడుతున్నాయి


ప్రభుత్వవైద్యశాలలు

నిష్ప్రయోజనాలవుతున్నాయి

వ్యాపార చికిత్సాలయాలు

సామాన్యుల నడ్డివిరగకొడుతున్నాయి


దొరికినంత

దారుణంగా

దోచుకుంటున్నాయి

దవాఖానాలు


అనారోగ్యాన్ని

ఆసరాగాతీసుకొని

అక్రమాలుచేస్తున్నాయి

ఆసుపత్రులు


డాక్టర్లు దంపతులయి

ద్విపాత్రాభినయనాలను చేస్తూ 

దగాచేసి రెండుచేతులా

డబ్బులు కొట్టేస్తున్నారు

 

మందుల దుఖానాలు

ధరలుపెంచి డిస్కౌంటులంట్లుచెప్పి

డాక్టర్లతో కుమ్మక్కయి 

దోపిడీలుచేస్తున్నారు


వైద్యశోధనలంటు

వివిధ పరీక్షలు వ్రాసి 

కమీషనులు కొట్టేస్తున్నారు 

బిషక్కులు


వైద్యో నారాయణోహరి

ఒకప్పుడు

డబ్బుపైకన్నేసే డాక్టరుగిరి

మరిప్పుడు


జబ్బులు రాకుండా

జాగ్రత్త పడండి

కర్మకాలి రోగాలొస్తే

ఖర్చుపెట్టటానికి సిద్ధపడండి


హాస్పటలు పాలయిన

కుటుంబం

దొంగలపడ్డ ఇంటితో

సమానం


కార్పొరేటు వైద్యశాలలు

కాస్టిలీయస్టుగా మారాయి

కాసులు కొట్టేయటానికి

కేంద్రాలుగా మారాయి 


అప్పుడు

వైద్యుడు దేవుడితో సమానం

ఇప్పుడు

వైద్యగానికిపొతే పోతాయిప్రాణాలని అర్ధం


కార్పొరేటు వైద్యం

కాసులకు కనాకష్టం

ప్రభుత్వ వైద్యగం

ప్రాణాలతో చెలగాటం


పరవాలేదు భయపడకండి

మంచిడాక్టర్లు కొందరున్నారండి

వెదికి పట్టుకోండి

పరిచయాలు పెంచుకోండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog