కొత్తచోటు కొత్తకలము కొంగొత్తకవిత
కొత్తూరు వచ్చా
కొత్తవాళ్ళను చూచా
కొత్తప్రదేశాలు చూచా
కొత్త అందాలనుకన్నా
కొత్త ఉద్యోగంలోచేరా
కొత్త ఇంటిలోదిగా
కొత్తబట్టలు కట్టా
కొత్తకొత్తగా తయారయ్యా
కొత్తమాటలు నేర్చా
కొత్తపాటలు విన్నా
కొత్త ఆటలాడా
కొత్త పాటులుపడ్డా
కొత్తపువ్వును చూచా
కొత్తకోరిక కలిగా
కొత్త ఆలోచనలొచ్చా
కొత్త కవితలను వ్రాశా
కొత్త పెళ్ళాం
కొత్త కాపురం
కొత్త అనుభవం
కొత్త జీవితం
కొత్తంత
పండుగలేదు
అల్లుడంత
చుట్టములేదు
కొత్త ఒకవింత
పాత ఒకరోత
కొత్తపాతల మేలుకలయిక
నూతనవొరవడి నాకవిత
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొత్త కలాన్నిపట్టి
కొత్త పుస్తకాన్నికొని
పగలంతా రాస్తా
రాత్రంతా రాస్తా
కొత్తకలంతో గీస్తా
కుడిచేతితో చెక్కుతా
ఇక చాలని అరిచేదాకా
సిరా ఖాళీ అయ్యేదాకా
కలంమంచిది
కమ్మనైనది
కదులుతుంది
కదిలిస్తుంది
నా కలం
నా నేస్తం
నా అదృష్టం
నా కవిత్వం
కలానికి
ధన్యవాదాలు
కవితలకు
స్వాగతాలు

Comments
Post a Comment