ఇదేమిలోకం?
ఇదేమిలోకం
ఇదేమిలోకం
కళ్ళనిండాద్వేషం
మనుసులనిండాస్వార్ధం
ఇదేమిన్యాయం
ఇదేమిన్యాయం
బలవంతులదేరాజ్యం
ధనవంతులదేపెత్తనం
ఇదేమికష్టం
ఇదేమికష్టం
పనిదొరకటమేకష్టం
కడుపునిండటమేకష్టం
ఇదేమిధర్మం
ఇదేమిధర్మం
కులానికోధర్మం
మతానికోధర్మం
ఇదేమిపక్షపాతం
ఇదేమిపక్షపాతం
ఆడామగామధ్య వ్యత్యాసం
బీదాధనికులమధ్య విచక్షణం
ఇదేమిరాజ్యం
ఇదేమిరాజ్యం
దళారులదేరాజ్యం
దోపిడీదారులదేరాజ్యం
ఇదేమిపాలనం
ఇదేమిపాలనం
నేరస్తులదేపాలనం
ఫిరాయింపుదారులదేపాలనం
ఇదేమిప్రజాస్వామ్యం
ఇదేమిప్రజాస్వామ్యం
డబ్బిచ్చినవాడికే అధికారం
దబాయించినవాడికే ఆధిపత్యం
ఇకకలుద్దాం
ఇకకలుద్దాం
అన్యాయాలను అరికడదాం
అక్రమాలను అంతంచేద్దాం
ఇకలేద్దాం
ఇకలేద్దాం
మనుజులను మార్చేద్దాం
మరోప్రపంచాని సృష్టిద్దాం
అందరమొకటవుదాం
అడుగులుముందుకేద్దాం
పిడికిలి ఎత్తుదాం
పోరాటం చేద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment