తెల్లనివన్ని పాలుకాదు
చూపేది
దైవధ్యానం
చేసేది
కొంగజపం
కనబరచేది
కుక్కవిశ్వాసం
దాచిపెట్టేది
నక్కటక్కరితనం
పైకి
తీపిచూపిస్తారు
లోపల
చేదునుదాస్తారు
బాహ్యాన
లాభమంటారు
అంతరాన
నష్టపరుస్తారు
పలుకులలో
ఇష్టంచూపిస్తారు
పనులలో
కష్టంకలిగిస్తారు
నటించి
నమ్మబలుకుతారు
ఉపక్రమించి
ఉపద్రవంచేస్తారు
ధర్మాత్మునిగా
కనబడతారు
దురాత్మునిగా
దుర్మార్గాలుచేస్తారు
పుణ్యమని
చెబుతారు
పాపాలను
చేస్తారు
పైకేమో
భక్తిముక్తి
లోపలేమో
భుక్తిరక్తి
సాయం
చేస్తామంటారు
మోసం
చేస్తూయుంటారు
పెదవిపై
తేనెపూచుకుంటారు
కడుపులో
విషందాచుకుంటారు
మాటలతో
నమ్మిస్తారు
చేతలతో
ముంచేస్తారు
కళ్ళకుకనిపించేవన్ని
నిజముకాదు
అంతరంగాన్నిదర్శిస్తేగాని
అసలువిషయంబయటపడదు
అన్నివిషయాలు
తెలుసుకోండి
ఆలోచించి
చక్కగామెలగండి
తెల్లనివన్ని
పాలుకాదు
నల్లనివన్ని
నీళ్ళుకాదు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment