మాటలమూటలు


మాటలు మూటకడతా

మన్ననలు పొందేస్తా


మాటలు పేరుస్తా

వాటివిలువలు పెంచేస్తా


మాటలు విసిరేస్తా

తేనెచుక్కలు చల్లేస్తా


మాటలు వండేస్తా

పంచభక్ష్యాలు వడ్డిస్తా


మాటలు కూరుస్తా

మాధుర్యం అందిస్తా


మాటలు దంచేస్తా

పిండివంటలు తినిపిస్తా


మాటలు పాటలుచేస్తా

చెవులకు శ్రావ్యతనందిస్తా


మాటలు ఊదేస్తా

సన్నాయి వినిపిస్తా


మాటలు మ్రోగిస్తా

దరువులు వినిపిస్తా


మాటలు అల్లేస్తా

పూలమాలలు మెడలోవేసేస్తా


మాటలు పారిస్తా

జలకాలు ఆడిస్తా


మాటలు ప్రేలుస్తా

దుష్టులను శిక్షిస్తా


మాటలు మండిస్తా

మోసకారులను తన్నితగలేస్తా


మాటలు సృష్టిస్తా

కొత్తదనం చూపిస్తా


మాటలు వెలిగిస్తా

వెలుగులు చిమ్మేస్తా


మాటలు నేర్పుతా

అర్ధాలు స్ఫురింపజేస్తా


మాటలు మొహరిస్తా

పోరాటాలు చేస్తా


మాటలు పెనవేస్తా

ప్రాసలు ప్రయోగిస్తా


మాటలు జతచేస్తా

సామెతలు సృష్టిస్తా


మాటలు వినిపిస్తా

మదులను తట్టేస్తా


మాటలు చల్లేస్తా

కవితలు పుట్టిస్తా


మాటలు కడిగేస్తా

అందాలు చూపిస్తా


మాటలు మంత్రిస్తా

మాయలు చేసేస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog