మాటతీరు
నోరే
నేస్తము
మాటలే
మానము
అప్యాయంగా
మాట్లాడితే
అభిమానమును
చూరగొంటావు
ఆవేశంగా
మాట్లాడితే
అనార్ధాలను
తెచ్చుకుంటావు
అధికంగా
మాట్లాడితే
వదరబోతుగా
ముద్రవేసుకుంటావు
అనవసరంగా
మాట్లాడితే
పిచ్చివాడిగా
పరిగణించబడతావు
అహంకారంతో
మాట్లాడితే
గర్విష్ఠిగా
పేరుతెచ్చుకుంటావు
కోపంగా
మాట్లాడితే
అశాంతిని
కొనితెచ్చుకుంటావు
ద్వేషంతో
మాట్లాడితే
శత్రుత్వాన్ని
తెచ్చుకుంటావు
నవ్వుతూ
మాట్లాడితే
ఆదరణను
పొందుతావు
ఏడుస్తూ
మాట్లాడితే
అవహేళనకు
గురవుతావు
అబద్ధాలు
మాట్లాడితే
అపనమ్మకాన్ని
మూటకట్టుకుంటావు
నిజాలు
మాట్లాడితే
నమ్మకస్థుడవని
పేరుతెచ్చుకుంటావు
ఆలోచించి
మాట్లాడితే
మేధావిగా
పేరుతెచ్చుకుంటావు
ఆచితూచి
మ్మాట్లాడితే
అపార్ధాలకు
తావుండదు
నోరు తెరిచేముందు
పరుసు తెరిచేముందు
జాగ్రత్తగానుండకపోతే
పరువుపోవచ్చు దబ్బుపోవచ్చు
మాటతీరు
మార్చుకో
మంచిపేరు
తెచ్చుకో
నోరు
బాగుంటే
ఊరు
బాగున్నట్లే
గుండ్లపల్లి రాజేంద్రప్రసద్, భాగ్యనగరం
మానము=మర్యద, గౌరవము
Comments
Post a Comment