నేను
నేను
ఇంద్రుడను కాను
చంద్రుడను కాను
పొగిడితే పొంగిపోను
నేను
కవిని కాను
రవిని కాను
అఙ్ఞానాంధకారాలను తరుమలేను
నేను
మంత్రిని కాను
మాంత్రికుడను కాను
మాటిచ్చిమరచిపోలేను మాయాజాలంచేయలేను
నేను
శక్తిని కాను
యుక్తిని కాను
ఎవరినీ ఓడించలేను
నేను
బడిని కాను
గుడిని కాను
విద్యలువరాలు ఇవ్వలేను
నేను
తల్లిని కాను
తండ్రిని కాను
ఎవరినీ పెంచిపోషించలేను
నేను
బరువును కాను
బాధ్యతను కాను
ఎవరికీ భారముకాను
నేను
కరటకుడిని కాదు
దమనకుడిని కాను
నీతికధలు బోధించలేను
నేను
కుక్కను కాను
నక్కను కాను
మొరగలేను మోసంచేయలేను
నేను
ప్రకృతిని కాను
పురుషుడిని కాను
కవ్వించి కవనంచేయించలేను
నేను
తృణాన్ని కాదు
పణాన్ని కాదు
చులకనగాచూస్తే ఊరుకోను
నేను
అందమును కాను
ఆనందమును కాను
అందరినీ ఆకట్టుకోలేను
నేను
గురువును కాను
దైవమును కాను
దక్షిణలుతీసుకోను దండాలుపెట్టించుకోను
నేను
పువ్వును కాను
నవ్వును కాను
కానీ కనబడితే కవితకూర్చకుండా ఉండలేను
నేను
కర్రతో కొట్టను
కత్తితో పొడవను
కానీ కలంతో కట్టేస్తాను
నేను
కవితను కాను
మమతను కాను
మనసులను దోచుకోకుండా ఉండలేను
నేను
అమాయకుడిని
అనామకుడిని
అక్షరపిపాసిని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment