చూపులు కలసిన శుభవేళ


చెలీ!

నిన్ను చూచా

మనసుపడ్డా

మనుమాడా


మన

చూపులు కలసినపుడు

చక్కదానాలు ఆస్వాదించాము

చిరునవ్వులు పంచుకున్నాము


మన

కళ్ళు కలసినపుడు

కళాకాంతులతో వెలిగిపోయాము

కుతూహలపడ్డాము


మన

మాటలు కలసినపుడు

మనము దగ్గరయ్యాము

మురిసిపొయ్యాము


మన

చేతులు కలసినపుడు

చేరువయ్యాము

స్నేహితులమయ్యాము


మన 

మోములు కలసినపుడు

ముద్దూముచ్చటలాడాము

మహదానందంపొందాము


మన 

కోరికలు కలసినపుడు

కళ్యణమాడదామనుకున్నాము

కలసి పయనించాలనుకున్నాము


మన

పెదవులు కలసినపుడు

అమృతాన్ని సేవించాము

అమరప్రేమికులమయ్యాము


మన

మనసులు కలసినపుడు

ముహూర్తం పెట్టించాము

మనుమాడాము


మన

శరీరాలు కలసినపుడు

స్వర్గానికెళ్ళివచ్చాము

సుఖాలలొతేలియాడాము


సతీ!

సంసారాన్ని ఈదుదాం

సంతానాన్ని పొందుదాం

సిరిసంపదలను కూడగడదాము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog