అదిగో అప్సరస!
దివినుండి దిగివచ్చిన
అప్సరస అదిగో!
కళ్ళముందుకు వచ్చింది
కళ్ళను కట్టిపడవేసింది
తల తిప్పలేకున్నాను
దృష్టి మరల్చలేకున్నాను
పిచ్చి పట్టినట్లుంది
వలలో చిక్కినట్లుంది
సొగసు లాగుతుంది
మనసు పీకుతుంది
రంగు నచ్చింది
హంగు అదిరింది
ఫోజుబాగుంది
పువ్వులాగుంది
నవ్వుతుంది
నవ్విస్తుంది
చేతులు కట్టుకున్నది
కాళ్ళు ముడుచుకున్నది
సోఫాలో కూర్చుంది
తిన్నగా చూస్తుంది
వలవిసురుతుంది
విలవిలలాడిస్తుంది
గులాబి చీరలోనున్నది
గుబులు పుట్టిస్తుంది
గుండెలో గుచ్చింది
గాయం చేసింది
రెచ్చకొట్టుతుంది
ముట్టుకోమంటుంది
చెంతకు చేరాలనిపిస్తుంది
సరసాలాడాలనిపిస్తుంది
అందాలను ఆస్వాదించాలనిపిస్తుంది
ఆనందమును అంతరంగంలోనిలుపుకోవాలనిపిస్తుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment