అక్షరాలు-మాటలు


అక్షరాలు 

అలరారుతున్నాయి

మాటలు 

మోతమ్రోగుతున్నాయి


అక్షరాలు

అల్లుకుంటున్నాయి

మాటలు

మాధుర్యాన్నిచల్లుతున్నాయి


అక్షరాలు

అలరుతున్నాయి

మాటలు

మత్తెక్కిస్తున్నాయి


అక్షరాలు

అలుముకుంటున్నాయి

మాటలు

ముసురుకుంటున్నాయి


అక్షరాలు

ప్రత్యక్షమవుతున్నాయి

మాటలు

మదినిమీటుతున్నాయి


అక్షరాలు

అరుస్తున్నాయి

మాటలు

మురిపిస్తున్నాయి


అక్షరాలు

నేర్వమంటున్నాయి

మాటలు

ఎరుగమంటున్నాయి


అక్షరాలు

పలుకమంటున్నాయి

మాటలు

పేల్చమంటున్నాయి


అక్షరాలు

కూడుతున్నాయి

మాటలు

ధ్వనిస్తున్నాయి


అక్షరాలు

ఆడుతున్నాయి

మాటలు

పాడుతున్నాయి


అక్షరాలు

అనుప్రాసలవుతున్నాయి

మాటలు

అంత్యప్రాసలవుతున్నాయి


అక్షరాలు

ఆహ్లాదపరుస్తున్నాయి

మాటలు

ముచ్చటపరుస్తున్నాయి


అక్షరాలు

అందంగా వ్రాయమంటున్నాయి

మాటలు

చక్కగా పలకమంటున్నాయి


అక్షరాలు

చేతిని వ్రాయమంటున్నాయి

మాటలు

మూతిని ఉచ్ఛరించమంటున్నాయి


అక్షరాలు

నశించవు

మాటలు

మరణించవు


అక్షరాలు

అమరం

మాటలు

మధురం


అక్షరాలు

కళ్ళకెక్కుతాయి

మాటలు

మదులకెక్కుతాయి


అక్షరాలకు

వరుసయున్నది

మాటలకు

సొగసుయున్నది


అక్షరాలకు

శక్తియున్నది

మాటలకు

యుక్తియున్నది


అక్షరాలు

భుక్తినిస్తాయి

మాటలు

ముక్తినిస్తాయి


అక్షరాలు

అద్భుతం

మాటలు

మహనీయం


అక్షరాలను

వశపరచుకుందాం

మాటలను

మచ్చికచేసుకుందాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


అలరారు= వెలుగు

అలరు= పూయు

అలుము= వ్యాపించు



Comments

Popular posts from this blog