చిన్నారుల చిరుకోరికలు
ఓ పువ్వా!
విచ్చుకో
అందాలను చూపించు
సువాసనలను వెదజల్లు
ఓ విహంగమా!
రెక్కలాడించు
గాలిలో ఎగురు
ఆకాశంలో విహరించు
ఓ కోకిలా!
పాడు పాడు
గొంతెత్తిపాడు
కమ్మనిరాగాలను వినిపించు
ఓ చిలుకా!
చక్కెరపెడతా మాట్లాడు
పచ్చదనాన్ని చూపించు
ఎర్రనిముక్కుతో శోభిల్లు
ఓ నెమలీ!
పురివిప్పు
నాట్యమాడు
పులకించు
ఓ తరంగమా!
ఎగిసిపడు
ఎదనుతట్టు
కడలితీరమునుచేరు
ఓ చిన్నారీ!
మురిపించు
ముసిముసిగనవ్వు
ముద్దుమాటలాడు
ఓ చందమా!
కనులకు కనిపించు
వెన్నెల కురిపించు
మనసుల మురిపించు
ఓ సూర్యుడా!
తూర్పున ఉదయించు
కిరణాలు ప్రసరించు
చీకటిని పారదోలు
ఓ కవీ!
బాలలకవితలువ్రాయి
అందాలనుచూపించు
ఆనందాన్నికలిగించు
చిన్నారుల
చిరుకోరికలు
వినండి
తీర్చండి
పిల్లల
మనసులను
తెలుసుకోండి
తన్మయపరచండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment