కొత్తసాలుకు స్వాగతం
కొత్త వత్సరమొచ్చె
కొత్త ఉత్సహమొచ్చె
కొత్త ఊహలొచ్చె
కొత్త కోర్కెలుపుట్టె
కొత్త కలమునుకొంటి
కొత్త పొత్తమునుతెస్తి
కొత్త పలుకులనువ్రాస్తి
కొత్త కవితలనల్లితి
కొత్తదుస్తులు తొడిగితి
కొత్తరూపము దాల్చితి
కొత్తఫోజును పెట్టితి
కొత్తదనమును చూపితి
కొత్తసమూహాలలో చేరితి
కొత్తపరిచయాలు చేసుకుంటి
కొత్తవిషయాలు నేర్చుకుంటి
కొత్తతరహాగా వ్రాయదలచితి
రెండువేలా ఇరవైరెండుకు
టాటాయని నొక్కిచెప్పెద
రెండువేలా ఇరవైమూడుకు
రారాయని స్వాగతించెద
పాతవత్సరానికి
వీడుకోలు
పాఠకులందరికి
శుభాకాంక్షలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment