శాంతమ్మా రావమ్మా!
జరుగుతుంది
ఉక్రెయినులోయుద్ధం
కలిగిస్తుంది
ఆస్తిప్రాణనష్టం
మరణిస్తున్నారు
సైనికులు
చచ్చిపోతున్నారు
పౌరులు
బాంబులు
ప్రేలుతున్నాయి
భవనాలు
కూలుతున్నాయి
బంకర్లలో
పౌరులుదాక్కుంటున్నారు
భయంతో
ప్రజలువణికిపోతున్నారు
ఆయుదాలిచ్చేవారు
ఆజ్యంపోసేవారు కొందరు
చోద్యంచూచేవారు
చలించనివారు మరికొందరు
పరిష్కారాలు
కనబడటంలా
ఆపేప్రయత్నాలు
జరగటంలా
కొనసాగితే అందరికీప్రమాదం
ప్రపంచయుద్ధమైతే అతిప్రమాదం
అణ్వాస్త్రాలువాడితే అత్యంతప్రమాదం
మానవాళిమనుగడే ప్రశ్నార్ధకం
యుద్ధంజరుగుతుంది అక్కడ
ధరలుపెరుగుతుంది ఇక్కడ
మరణాలుసంభవిస్తుంది అక్కడ
విషాదాలుకమ్ముకుంటుంది ఇక్కడ
ఎవరికోసం యుద్ధం?
ఎందుకోసం యుద్ధం?
ఎన్నాళ్ళు ఈయుద్ధం?
ఎవరుప్రేరేపిస్తున్నారు యుద్ధం?
నీళ్ళు లేక
విద్యుత్తు లేక
భద్రత లేక
అక్కడ జనులు అలమటిస్తున్నారు శాంతమ్మా!
వేడుకుంటున్నా
నమస్కరిస్తున్నా
తపిస్తున్నా
ఆలశ్యంచేయకుండా రావమ్మా శాంతమ్మా!
ఓ శాంతమ్మా!
త్వరగా రావమ్మా!
ప్రాణాలను కాపాడమ్మా!
ప్రపంచాన్ని రక్షించమ్మా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
(ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎన్నినెలలనుండో జరుగుతుంది. యుద్ధం ఆగిపోయే సూచనలు కనబడటం లేదు. ఘోరాలు జరుగుతున్నాయి. ప్రపంచయుద్ధంగా మారుతుందేమోనని భయమేస్తుంది. మానవాళికే ముప్పు పొంచియున్నది)
Comments
Post a Comment