పున్నమివెన్నెల చూద్దాం
(బాలగేయం)
చుక్కలగగనము చూద్దాము
తళతళతారల చూద్దాము
నక్షత్రాలు లెక్కిద్దాము
కాలక్షేపము చేద్దాము
చందమామను చూద్దాము
చక్కదనాలను చూద్దాము
చల్లనివెన్నెల చూద్దాము
చాలాసంబర పడదాము
నీలాకాశము చూద్దాము
నేత్రాలకు విందిద్దాము
వెండిమబ్బులను చూద్దాము
వెన్నెలలో విహరిద్దాము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment