పిల్లలం బడిపిల్లలం
అందంగా తయారవుతాం
అదరాబదరా బడికెళ్తాం
అక్షరాలను నేర్చుకుంటాం
అమ్మాఆవులు వ్రాసుకుంటాం
అయ్యవార్లను గౌరవిస్తాం
అచ్చతెలుగులో మాట్లాడుతాం
అక్కచెల్లెల్లతో ఆడుకుంటాం
అన్నాదమ్ముల్లతో కలసిపోతాం
అమ్మానాన్నల అలరిస్తాం
అల్లరిపనులను మానేస్తాం
అభిమానాలు చూపుతాం
అనురాగాలు పంచుతాం
అపహాసాలు చేయం
అవహేళనలు ఎరుగం
అబద్ధాలను చెప్పం
అన్యాయాలకు ఒడికట్టం
అన్నీ తెలుసుకుంటాం
అందరితో బాగుంటాం
అన్నెంపున్నెం ఎరగనివాళ్ళం
అమాయకులం బడిపిల్లలం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment