తెలుగు వెలుగులు
చూడుచూడు
తెల్లవారింది
వెలుగొచ్చింది
తెలుగోదయమయ్యింది
చూడుచూడు
అరుణ కిరణాలొచ్చాయి
అందరిని తట్టిలేపాయి
ఆంధ్రావనిని మెరిపిస్తున్నాయి
చూడుచూడు
తెలుగుతల్లి మురిసిపోతుంది
తనయల లాలిస్తుంది
తనయుల పోషిస్తుంది
చూడుచూడు
మన తెలుగుమాత
మదులను తట్టుతుంది
మేనులను ముట్టుతుంది
చూడుచూడు
తెలంగాణాంధ్ర
తెలుగు మాగాణి
తెలుగు టికానా
చూడుచూడు
కోస్తాంధ్ర
కర్షకులకు
కాసులపంట
చూడుచూడు
రాయలాంధ్ర
రత్నాలపుట్టిల్లు
రాయలేలినప్రాంతము
ఓరి తెలుగోడా!
తెలుగును
సుధలోముంచరా
అమరంచెయ్యరా
ఓరి తెలుగోడా
తెలుగుకు
పరిమళాలద్దరా
సువాసనలు వెదజల్లరా
ఓరి తెలుగోడా
తెలుగుకు
తేనెను తగిలించరా
తియ్యదనాలతో తనివితీర్చరా
ఓరి తెలుగోడా
తెలుగుకు
సొబగులనద్దరా
చక్కనిభాషని చాటరా
ఓరి తెలుగోడా
తెలుగుభాషకు పట్టంకట్టరా
తెలుగుతల్లికి జైకొట్టరా
తెలుగుకీర్తిని వ్యాపించరా
ఓరి తెలుగోడా
ఆంధ్రాకు అండగానిలవరా
తెలుగును తలకెత్తుకోరా
దేశవిదేశాలలో దెదీప్యమానంగావెలిగించరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment