నా పువ్వు - నా ప్రియురాలు


పూలమొక్కను

తెచ్చాను

పెరటినందు

నాటాను


నీళ్ళను

పోశాను

ఎరువును

చల్లాను


ప్రతిదినం

శ్రద్ధతీసుకున్నాను

చెట్టును

ఏపుగాపెంచాను


ఆ చెట్టు

మొదటిమొగ్గను తొడిగినపుడు

నేను

సంతసించాను


ఆ మొగ్గ

పువ్వుగా మారినపుడు

నేను

మురిసిపోయాను


ఆపువ్వు

వికసించినపుడు

నేను

ఆనందపడ్డాను


ఆ విరి

అలరించింది

నా మదిని

మైమరపించింది


ఆ అందం

అద్భుతం

ఆ ఆనందం

వర్ణనాతీతం


అపుడు

ఆ పుష్పమును

నేను

తుంచలేదు


ఆ సుమం

సుగంధం చల్లినపుడు

నేను

మురిసిపోయాను


ఆ పరిమళము

పులకరించింది హృదయమును

ఆ సుగంధము

రేపింది నాలో కాంక్షను


ఆ కుసుమమునకు

అంతిమఘడియలు

ఆసన్నమయ్యాయని

అర్ధమైంది


తక్షణము

పువ్వునుతెంచాను

ప్రేయసికొప్పులోతురిమాను

పరవశించిపోయాను


ఆ పువ్వు

వన్నెను

నాప్రియురాలికి

ఇచ్చింది


ఆ పువ్వు

పరిమళాన్ని

నా సఖి

వంటికంటించింది


ఆ పువ్వు

ప్రకాశాన్ని

నాచెలికి

ధారాదత్తంచేసింది


ఆపువ్వు 

అందాన్ని

నాప్రేయసికి

అంకితమిచ్చింది


అదిమొదలు

ప్రియురాలు

చేరుతుందిచెంతకు ప్రతిరోజు

చూపుతుంది వన్నెలుచిన్నెలు


ఆ పువ్వుకు

ధన్యవాదాలు

ఆ పడుచుకు


అభివందనాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog