జీవితపాఠాలు నేర్చుకో!
ఎండైనా చలైనా
ఎదుర్కో
కష్టమైనా సుఖమైనా
కాచుకో
ఓటమైనా గెలుపైనా
ఓర్చుకో
పగలయినా రేయయినా
పనులుచేసుకో
నిజమైనా నిష్టూరమయినా
న్యాయంవైపేనిలుచో
పచ్చయినా పండయినా
పొట్టనింపుకో
సరికొత్తయినా పాతయినా
సర్దుకుపో
ఉన్నా లేకపోయినా
ఉసూరుపడకు
అందినా అందకపోయినా
ఆశయంవైపే అడుగులేయ్యి
తిన్నా తినకపోయినా
తృప్తిపడు
వాన్నొచ్చినా వరదొచ్చినా
వదలక ఈదటంనేర్చుకో
మిత్రుడైనా శత్రువైనా
మేలుచెయ్యి
పశువైనా పక్షయినా
ప్రేమించు
బరువైనా తేలికయినా
బతుకుబండిని లాగు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment