ఓ సుందరీ!
రమ్మనిపిలిస్తే
రాత్రయినా పరుగెత్తుకుంటూరానా!
సైగచేస్తే
స్పందించనా చెంతకుచేరనా!
కవ్విస్తే
కరిగిపోనా కోరికతెలపనా!
కలలోకొస్తే
కబుర్లుచెప్పనా కాలక్షేపంచెయ్యనా!
మత్తెక్కిస్తే
మైమరచిపోనా ముద్దులవర్షంకురిపించనా!
క్రేగంట చూస్తే
కనిపెట్టనా బదులివ్వనా!
చిరునవ్వులు చిందిస్తే
చూడనా ప్రతిస్పందించనా!
తోడురమ్మంటే
తక్షణం పక్కకుచేరనా!
సరసాలాడితే
సంతసించనా చెంతకుచేరనా!
గుసగుసలాడదామంటే
గులాబీతోటలోనికి తీసుకెళ్ళనా!
మసకచీకట్లో రమ్మంటే
మల్లెపందిరిక్రిందకు ముందేచేరనా!
అమృతం అందిస్తానంటే
అందుకోనా ఆస్వాదించనా!
వలపువల విసిరితే
చిక్కనాదొరకనా విలవిలలాడనా!
వెన్నెలలో విహరిద్దామంటే
రెక్కలుకట్టుకొని వాలనా!
మనుమాడదామంటే
ముహుర్తంపెట్టించనా మెడలోతాళికట్టనా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment