ఓ వెర్రి రంగా!
(గంగ రంగ ప్రేమాయణం)
ఓరి రంగా
వెర్రి రంగా!
పల్లె రంగా
పూల రంగా!!
గాజులు
గలగల మ్రోగుతుంటే
గంగ పిలుస్తుందని
తెలుసుకోరా వెర్రివాడా!
గజ్జెలు
ఘల్లుఘల్లుమంటుంటే
గంగ రమ్మంటుందని
తెలుసుకోరా పిచ్చివాడా!
మల్లెలు
ఘుమఘుమలాడుతుంటే
గంగ తయారయియున్నదని
తెలుసుకోరా మొరటోడా!
కూనిరాగాలు
వినబడుతుంటే
గంగ ఉషారుగాయున్నదని
తెలుసుకోరా అమాయకుడా!
నవ్వులు
పకపకావినిపిస్తుంటే
గంగ కవ్విస్తున్నదని
తెలుసుకోరా అవివేకుడా!
గది
కళకళవెలుగుతుంటే
గంగ కాచుకొనియున్నదని
తెలుసుకోరా తిక్కలోడా!
ఇల్లు
శుభ్రంగాయున్నదంటే
గంగ వేచియున్నదని
తెలుసుకోరా దద్దమ్మా!
అలిగి
మూతిబిగిస్తే
గంగ బెట్టుచేస్తుందని
తెలుసుకోరా వెర్రివెంగళప్పా!
రంగా
గప్ చుప్ గా వెళ్ళు
గంగను నీదానను
చేసుకోరా పిచ్చిపుల్లయ్యా!
అర్ధమైతే
బాగుపడతావురా
లేకుంటే
తూరుపుతిరిగరా దండంపెట్టుకోరా రంగా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment