ఏమిటిది సమాజమా!
నవ్వే నాతిని
నమ్మకూడదా!
ఎప్పుడూ మగువను
ఏడుస్తుండమంటావా!
ఏడ్చే మగవాడిని
విశ్వసించకూడదా!
ఎప్పుడూ పురుషుడుమాత్రమే
నవ్వుతుండాలా!
ఆడది తిరిగితే
చెడుతుందా!
ఆడవాళ్ళను
ఇల్లు విడవద్దంటావా!
మగవారు తిరగకపోతే
చేడతారా!
మీసాలున్నవాళ్ళే
బయటకెళ్ళి సంపాదించాలా!
అత్తలేని కోడలు
ఉత్తమురాలా!
అమ్మలులేని అబ్బాయిలకే
అమ్మాయిలనివ్వాలా!
కోడలులేని అత్త
గుణవంతురాలా!
కొడుకులనే కనవద్దంటావా!
కన్నా కుమారులకు పెళ్ళిచెయ్యొద్దంటావా!
ఎంత అన్యాయంగా
చెబుతున్నావు సమాజమా!
ఎంతమూఢంగా
మాట్లాడుతున్నావు సమాజమా!
కాలంతో మనమూమారదాం
లింగవివక్షను వదిలేద్దాం
అత్తాకోడళ్ళను కలిపేసేద్దాం
సమాజాన్ని సంస్కరించేద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment