గులాబీలు
గులాబీలు ముచ్చటగున్నాయి
గుండెలో గుబులుపుట్టిస్తున్నాయి
మణీచకాలు మురిపిస్తున్నాయి
ముగ్ధముచ్చట్లు చెబుతున్నాయి
గులాబీలు గుబాళిసున్నాయి
గుండెను మీటుతున్నాయి
వికసిస్తామంటున్నాయి
వేచియుండమంటున్నాయి
చెంతకు చేరమంటున్నాయి
చేతిలోకి తీసుకోమంటున్నాయి
స్పృశించమంటున్నాయి
సుఖపెట్టమంటున్నాయి
సుందరంగాయున్నాయి
సుకుమారంగాయున్నాయి
ఆలోచనలు ఆగటంలేదు
ఆవేశమూ తగ్గటంలేదు
కళ్ళు మూతపడటంలేదు
కాళ్ళు కదలటములేదు
సొగసులు కట్టేస్తున్నాయి
మనసును పట్టేస్తున్నాయి
కుసుమాలు కవ్విస్తున్నాయి
కవితను కూర్చమంటున్నాయి
కవనకష్టము ఫలించింది
కవితయొకటి సమకూరింది
పదాలను ప్రయోగించా
భావాలను బహిరంగపరచా
మెదడులను మెట్టాలని చూచా
మనసులను ముట్టాలని చూచా
చూచి సంబరపడండి
చదివి సంతసించండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మణీచకాలు= పూలు
మెట్టు= ప్రవేశించు, చొచ్చు
Comments
Post a Comment