ఆశలజోరు


ఆశలు కలుగుతున్నాయి

చూచింది విన్నది

చదివింది తెలిసింది

మనసు కావాలంటుంది


ఆశలు పెరుగుతున్నాయి

అనుభవించాలని

ఆనందించాలని

మనసు ఆరాటపడుతుంది


ఆశలు రెచ్చకొడుతున్నాయి

సాధించితీరాలని

సమయంతీసుకోవద్దని

మనసును ఉద్రేకపరుస్తున్నాయి


ఆశలు వెంటబడుతున్నాయి

ఆలశ్యం చేయ్యవద్దంటున్నాయి

వెనక్కు తగ్గవద్దంటున్నాయి

మనసును తొందరపెడుతున్నాయి


ఆశలు వీడటంలేదు

ఆలోచనలను రేపుతున్నాయి

అంతర్ముఖుడిని చేస్తున్నాయి

మనసును వేధిస్తున్నాయి


ఆశలు గుర్రాలవుతున్నాయి

ఆగకుండా పరుగెత్తుతున్నాయి

అదిరించినా బెదరకున్నాయి

మనసును మోచికొనిపోతున్నాయి


ఆశలు అంతంకాకున్నాయి

అన్యాయాలకు దిగమంటున్నాయి

అక్రమాలకు పాల్పడమంటున్నాయి

మనసును వ్యధపెడుతున్నాయి


ఆశలు ఆకాశాన్నితాకుతున్నాయి

అంబుధి అగాధాలనుచేరుతున్నాయి

అన్నీ కావలసిందేనంటున్నాయి

అంతరంగంపై అధికారంచలాయిస్తున్నాయి


ఆశలు అల్లుకుంటున్నాయి

పైపైకి ప్రాకుతున్నాయి

డొంకంతా వ్యాపిస్తున్నాయి

పుడమిని ముట్టేస్తున్నాయి


ఆశలు ప్రలోభపెడుతున్నాయి

వలలు విసురుతున్నాయి

పల్లకిని ఎక్కిస్తున్నాయి

మనసును వశపరచుకుంటున్నాయి 


అత్యాశలకుపోకురా మానవుదా

అగసాట్లు పడొద్దురా

అనర్ధాలు తెచ్చుకోవద్దురా

అన్యధా భావించొద్దురా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog