కనుక్కో?


ఏ పుట్టలో

ఏ పామున్నదో?


ఏ మట్టిలో

ఏ మాణిక్యమున్నదో?


ఏ మనసులో

ఏ రహస్యమున్నదో?


ఏ గుప్పెట్లో

ఏ దాపరికమున్నదో?


ఏ రాశివారికి

ఏ ఫలంలభిస్తుందో?


ఏ సంవత్సరం

ఏ జాతకుడికిలాభమో?


ఏ కష్టానికి

ఏ ప్రాప్తమో?


ఏ దరువుకు

ఏ చిందువేస్తారో?


ఏ నోటినుండి

ఏ రత్నంరాలుతుందో?


ఏ పెదవినుండి

ఏ పలుకులువస్తాయో?


ఏ అక్షరంలో

ఏ తీపియుందో?


ఏ మాటకు

ఏ అర్ధముందో?


ఏ కవితలో

ఏ భావముందో?


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog