ఏటి పని యిది సమాజమా!
ఆడామగా అంతరాలను చూపి
అతివలను అణుచుట న్యాయమా!
ఏమి పని ఇది సమాజమా!
తక్కువకులమంటూ తోటివారిని
తూలనాడుట భావ్యమా!
ఏమి పని ఇది సమాజమా!
అన్యమతస్థులంటు అవతలవారిని
అక్షేపించుట సహేతుకమా!
ఏమి పని ఇది సమాజమా!
బీదవారి లేమిని సాకుగావాడి
బానిసలుగా వాడుట తగునా!
ఏమి పని ఇది సమాజమా!
బలహీనులను అదిరించి
బెదిరించి లొంగతీసుకొనుట ధర్మమా!
ఏమి పని ఇది సమాజమా!
అభివృద్ధిపథంలో నడిచేవారిని
అడ్డగించుట సమంజసమా!
ఏమి పని ఇది సమాజమా!
పచ్చని కుటుంబాలను చూచి
పరవశించక అసూయచెందుట సమర్ధనీయమా!
ఏమి పని ఇది సమాజమా!
పరిగెత్తుకొంటూ పోయేవారిని
పడగొట్టటం సరియా!
ఏమి పని ఇది సమాజమా!
ప్రశ్నలు వేచేవారిని
పట్టుకొని గొంతులునొక్కుట సక్రమమా!
ఏమి పని ఇది సమాజమా!
వ్యతిరేకించేవారిని
వెంటాడి వేధించుట తగునా!
ఏమి పని ఇది సమాజమా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment