ఓ ప్రియా!
లే లెమ్మంటూ
నన్ను లేపావే
మదిని తట్టావే
మనసు దోచావే
రా రమ్మంటూ
నను పిలిచావే
కనుసైగ చేశావే
కదిలించి పోయావే
పో పొమ్మంటూ
చేయిచూపావే
వెక్కిరించావే
ఆటపట్టించావే
తే తెమ్మంటూ
తహతహలాడావే
తొందరచేశావే
తత్తరపెట్టావే
కూ కూయంటూ
కంఠము నిప్పావే
కోకిలను తలపించావే
కమ్మగా పాడావే
సై సైయంటూ
సవాలువిసిరావే
పోటీకొచ్చావే
కవ్వించావే
బై బైయంటూ
టాటాచెప్పావే
ఉడికించావే
ఏడిపించావే
చెంతకురా చెలీ!
చెలిమి చేసుకుందాం
చెట్టాపట్టాలేసుకుందాం
చక్కగా ఒకటవుదాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment