చదువుకునే పిల్లలు


చదువుకునే పిల్లలు

చూడ చక్కగున్నరు

సంచి తీసుకున్నరు

చకచకా బడికివెళ్తున్నరు


ఆడుకునే బాలలు

అందముగానున్నరు

బంతులు విసురుతున్నరు

బ్యాటుతో కొడుతున్నరు


పంతుళ్ళదగ్గర చిన్నారులు

పాఠాలు నేర్చుకుంటున్నరు

పట్టుబట్టి చదువుతున్నరు

పుస్తకాలలో వ్రాస్తున్నరు


పరీక్షలకు విద్యార్ధులు

పరిశ్రమిస్తున్నరు

ప్రధమశ్రేణి కోరుతున్నరు

పతకాలు గెలవాలంటున్నరు


మాటలాడు బిడ్డలు

మాధుర్యాలు చిందుతున్నరు

ముద్దులొలుకుతున్నరు

ముచ్చటపరుస్తున్నరు


విఙ్ఞాలు తొలగించమంటు

విఘ్నేశ్వరుని వేడుకుంటున్నరు

బాగా చదువులనివ్వమంటు

భారతీదేవిని పూజిస్తున్నరు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog