జాగ్రత్తో జాగ్రత్త!
మారుస్తా
నిన్ను మంచివాడిగామారుస్తా!
విన్నావా
సంతసించి ఉరకుంటా!
వినలేదా
తన్ని తగలేస్తా!
తిడతా
నోటికొచ్చినట్టు తిడతా!
కొడతా
బర్రెనుకొట్టినట్టు కొడతా!
పెడతా
వంటికి వాతలుపెడతా!
మూపిస్తా
మూతిని మూపిస్తా!
కట్టేస్తా
రెండుచేతులు కట్టేస్తా!
తంతా
రెండుకాళ్ళతో తంతా!
వ్రాస్తా
మనసుకుతట్టినట్లు వ్రాస్తా!
తెస్తా
నిన్ను దారికితెస్తా!
మానిపిస్తా
దురాలోచనలను మానిపిస్తా!
నడుచుకో
బుద్ధిగా నడుచుకో!
బాగుచెయ్యి
సంఘాన్ని బాగుచెయ్యు
తెచ్చుకో
పేరుప్రఖ్యాతులు తెచ్చుకో!
మసలుకో
మంచిగా మసలుకో!
తెలుసుకో
నేనెవరో తెలుసుకో!
జాగ్రత్త
నేరాలుచేశావో జాగ్రత్త!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment