మామా! చందమామా!
చందమామ వచ్చాడు
చక్కలిగింత పెట్టాడు
చల్లనిగాలిని వీచాడు
చక్కదనమును చూపాడు
వెన్నెలజల్లు కురిపించాడు
వెండిమబ్బుల్లో తిరిగాడు
వినోదమెంతో యిచ్చాడు
విహరించమని చెప్పాడు
తారలమధ్య తిరిగాడు
తనువుల పులకరించాడు
తన్మయత్వపరిచాడు
తళుకుబెళుకులు చూపాడు
ఆటలాడమన్నాడు
పాటలుపాడమన్నాడు
ముచ్చట్లుచెప్పుకోమన్నాడు
మురిసిపొమ్మనిచెప్పాడు
గోరుముద్దలు తినమన్నాడు
కడుపు నింపుకోమన్నాడు
కమ్మగ నిదురపొమ్మన్నాడు
కలలెన్నో కనమన్నాడు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment